దొంగబాబా తాటతీయండి.. ఎమ్మెల్సీ కవిత ఆదేశం

|

Oct 13, 2020 | 11:02 PM

నిజామాబాద్ లో వైద్యం పేరుతో లైంగికదోపిడీకి పాల్పడ్డ దొంగ బాబాను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించారు. బాలికను వైద్యం పేరిట మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టి తల్లిని చేసిన కర్కోటకుడికి బుద్ది వచ్చేలా చేయాలని కవిత అన్నారు. కాగా, దొంగబాబా చేతిలో లైంగికదాడికి పాల్పడ్డ బాధితురాలిని నగర మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సుమనా రెడ్డి పరామర్శించారు. ఎం.ఎల్.సి కవిత ఆదేశాలతో బాధితురాలికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని […]

దొంగబాబా తాటతీయండి.. ఎమ్మెల్సీ కవిత ఆదేశం
Follow us on

నిజామాబాద్ లో వైద్యం పేరుతో లైంగికదోపిడీకి పాల్పడ్డ దొంగ బాబాను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించారు. బాలికను వైద్యం పేరిట మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టి తల్లిని చేసిన కర్కోటకుడికి బుద్ది వచ్చేలా చేయాలని కవిత అన్నారు. కాగా, దొంగబాబా చేతిలో లైంగికదాడికి పాల్పడ్డ బాధితురాలిని నగర మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సుమనా రెడ్డి పరామర్శించారు. ఎం.ఎల్.సి కవిత ఆదేశాలతో బాధితురాలికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అన్నివిధాలా అండగా నిలుస్తామని బాధితురాలి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.