సమస్యలను ప్రశ్నించినందుకు సామాన్యుడిపై ఎమ్మెల్యే బూతు పురాణం..!

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రెచ్చిపోయారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ఓ యువకుడిపై నోరు పారేసుకున్నారు.

సమస్యలను ప్రశ్నించినందుకు సామాన్యుడిపై ఎమ్మెల్యే బూతు పురాణం..!

Updated on: Nov 07, 2020 | 8:28 PM

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రెచ్చిపోయారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ఓ యువకుడిపై నోరు పారేసుకున్నారు. తానో ప్రజాప్రతినిధిని అన్న సంగతి మరిచిపోయారు. అసభ్యపదజాలంతో దూషించారు. నీ అంతు చూస్తానని హెచ్చరించారు.

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల సమస్యలపై ప్రశ్నిస్తున్న తనను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెదిరించారని ఓ యువకుడు ఆరోపించారు. ఫోన్ చేసి తనను దారుణమైన బూతులు తిట్టడంతో పాటు బెదిరించాడడని బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బూతులతో దూషించిన ఫోన్ కాల్ ఆడియో టేప్‌ను విడుదల చేశాడు. అసభ్యపదజలంతో తిడుతూ ‘నీ అంతు చూస్తా’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెదిరించారని రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.

మానకొండూర్ ఎమ్మెల్యే అయిన రసమయి బాలకిషన్ ఆ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో టేప్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అసభ్యపదజాలంతో సదరు యువకుడిని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దూషించారు. ఇంకోసారి నియోజకవర్గ సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే అంతు చూస్తానని ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.