AP Ministers: మంత్రులంతా అటెన్షన్..మొదలైంది మార్చి టెన్షన్

|

Mar 06, 2020 | 3:01 PM

ఇప్పడంతా ఎగ్జామ్స్‌ సీజన్‌. ఇంటర్‌ పరీక్షలు మొదలయ్యాయి. మార్చి 19 నుంచి టెన్త్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. స్టూడెంట్స్‌తో పాటు రాజకీయ నేతలకు ఈనెల పరీక్షా కాలం. ముఖ్యంగా ఏపీలో ఈ పరిస్థితి నెలకొంది.

AP Ministers: మంత్రులంతా అటెన్షన్..మొదలైంది మార్చి టెన్షన్
Follow us on

AP cabinet ministers are gearing up for March test: ఇప్పడంతా ఎగ్జామ్స్‌ సీజన్‌. ఇంటర్‌ పరీక్షలు మొదలయ్యాయి. మార్చి 19 నుంచి టెన్త్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. స్టూడెంట్స్‌తో పాటు రాజకీయ నేతలకు ఈనెల పరీక్షా కాలం. ముఖ్యంగా ఏపీలో ఈ పరిస్థితి నెలకొంది. నెలాఖరులో ఏపీలో పొలిటికల్ పరీక్షలు రాబోతున్నాయి. ఆ ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ అయితే.. ఇంటికే పంపిస్తారట. మరీ ప్రిన్సిపల్‌ వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో మంత్రులంతా అటెన్షన్‌లో వచ్చారు. మార్చి టెస్టు కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు.

‘‘లోకల్‌ ఎలక్షన్‌లో ఓడిపోవద్దు.. ఓడిపోతే పదవులు కట్‌..’’ మంత్రులకు జగన్‌ వార్నింగ్‌. స్థానిక సంస్థలకు ఏపీలో వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగిన వెంటనే…. మున్సిపల్… ఆతర్వాత వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మంత్రులకు మార్చి టెన్షన్ పట్టుకుంది.

స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో ఏపీ మంత్రుల్లో ఆందోళన మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాకపోతే పదవులు పోతాయని జగన్ హెచ్చరించిన నేపథ్యంలో మంత్రులు తమ తమ జిల్లాల్లో పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్ మంత్రులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

మంత్రుల సొంత నియోజకవర్గాల్లో ఓడిపోతే ఊరుకునేది లేదని, అవసరమైతే పదవిలో నుంచి తీసేయడానికి వెనుకాడనని జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత ఇంఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులదే అని హెచ్చరించినట్లు సమాచారం. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాకపోతే ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఉండవని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విధంగా జగన్ దగ్గర నుంచి వార్నింగ్‌ రావడంతో మంత్రులు అలెర్ట్ అయ్యారు.

తమ జిల్లాలో ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లు గెలిపించుకోవాలని మంత్రులు వ్యూహాలు రచిస్తున్నారు. గెలుపు కోసం ఏం చేయాలి? అనే దానిపై వర్క్‌వుట్‌ చేసే పనిలో పడ్డారు. ప్రతిపక్ష పార్టీని వీక్‌ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తానికి మార్చి నెలలో మంత్రుల భవిష్యత్‌ తేల్చబోయే ఎన్నికలు జరగబోతున్నాయట.