బండి సంజయ్ మాటలకు ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్.. పిచ్చివాళ్ల మాటలను మేం పట్టించుకోమని ప్రకటన..

|

Nov 29, 2020 | 7:30 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మాటల తూటాలతో దూసుకెళుతున్నారు. దుబ్బాక గెలుపుతో మంచి జోష్ మీదున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

బండి సంజయ్ మాటలకు ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్.. పిచ్చివాళ్ల మాటలను మేం పట్టించుకోమని ప్రకటన..
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మాటల తూటాలతో దూసుకెళుతున్నారు. దుబ్బాక గెలుపుతో మంచి జోష్ మీదున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే అవకాశముందని ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఘాటు సమాధానమిచ్చారు. ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలని కొట్టి పారేశారు. ఎల్బీ స్టేడియంలో సీఎం సభ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ మేయర్ పీటం కైవసం చేసుకుంటుందని, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కుప్పకులుతుందని బండి సంజయ్ ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని కామెంట్ చేశారు. అయితే సీఎం కేసీఆర్ సభకు హాజరైన మంత్రి కేటీఆర్‌ను విలేకరులు చుట్టుముట్టి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘ఎవరో పిచ్చోడు మాట్లాడిన మాటలను మేం పట్టించుకోం…’ అంటూ కొట్టిపారేశారు. అలాగే నిన్న జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కూడా బండి సంజయ్ ఆరోపణలను ఖండించారు. జీహెచ్ఎంసీలో గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం.. విగ్రహాలు కూలుస్తాననటం వంటివి పనికిమాలిన వాళ్లు చేస్తారని మండిపడ్డారు.