ఉద్యమ స్ఫూర్తితో సస్యశ్యామలం.. రైతన్న కళ్ళలో మురిపెం: కేటీఆర్

|

Aug 27, 2020 | 12:40 PM

ఈ ఏడాది వానాకాలం పంటల సాగులో దేశంలోనే తెలంగాణ మొద‌టిస్థానంలో నిల‌వ‌డంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సాగునీరులేక నెర్రెలు బారిన తెలంగాణ నేల, కేసీఆర్ గారి నేతృత్వంలో నదీ జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తున్న‌ద‌ని అన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో సస్యశ్యామలం..  రైతన్న కళ్ళలో మురిపెం: కేటీఆర్
Follow us on

ఈ ఏడాది వానాకాలం పంటల సాగులో దేశంలోనే తెలంగాణ మొద‌టిస్థానంలో నిల‌వ‌డంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సాగునీరులేక నెర్రెలు బారిన తెలంగాణ నేల, కేసీఆర్ గారి నేతృత్వంలో నదీ జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తున్న‌ద‌ని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే, రైతన్న కళ్ల‌లో మురిపెం కనపడుతున్న‌దని మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు.

గ‌త వానాకాలం పంట‌తో పొలిస్తే రాష్ట్రంలో 36.59 శాతం పెరిగింది. లక్ష్యాలను మించి పంట సాగు చేస్తున్నారు తెలంగాణ రైతులు. గ‌తేడాది వానాకాలంలో రాష్ట్ర‌వ్యాప్తంగా 1.02 కోట్ల ఎక‌రాల్లో పంట‌లు సాగ‌వ‌గా, ఈ ఏడాది 1.37 కోట్ల ఎక‌రాల్లో సాగుచేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ లక్ష్యం కోటీ 25 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది 41.76 లక్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంటను సాగు చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికంటే 5 లక్ష‌ల ఎక‌రాల్లో అధికంగా (46.55 ల‌క్ష‌ల ఎక‌రాల్లో) వ‌రినాట్లు ప‌డ్డాయి.

అదేవిధంగా 60.16 లక్ష‌ల ఎక‌రాల్లో ప‌త్తి సాగు ల‌క్ష్యంగా నిర్ణ‌యించ‌గా, 58.92 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ప‌త్తిసాగు జ‌రిగింది. గతంతో పోల్చితే అధిక వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణ నుంచి ఎగుమతులు చేయబోతున్నామని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అన్నదాతకు అండగా రైతుబంధు అందించ‌డంతోపాటు, వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ చేయ‌డం, స‌కాలంలో రైతుల‌కు ఎరువులు, విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేయ‌డం కూడా అధిక పంట‌ల సాగుకు దోహదం చేసింద‌ని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.