కేసీఆర్ ప్రధాని..కేటీఆర్‌ సీఎం కావాలి..: గంగుల కమలాకర్‌

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పనితీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడని కమలాకర్ కొనియాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో గల్లంతైందన్నారు. వచ్చే 40 ఏళ్లపాటు తెలంగాణలో తెరాసే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 40 ఏళ్లు టీఆర్‌ఎస్‌ అధికారంలో […]

కేసీఆర్ ప్రధాని..కేటీఆర్‌ సీఎం కావాలి..: గంగుల కమలాకర్‌

Edited By:

Updated on: Jan 30, 2020 | 5:36 PM

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పనితీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడని కమలాకర్ కొనియాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో గల్లంతైందన్నారు. వచ్చే 40 ఏళ్లపాటు తెలంగాణలో తెరాసే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 40 ఏళ్లు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. రాష్ట్రంలో కేటీఆర్ సీఎం కావాలని పేర్కొన్నారు.