కర్నూల్ నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ పాసింజర్స్ కి అవంతి గ్రాండ్‌ వెల్ కం, రాష్ట్రంలో 6 ఎయిర్‌పోర్టులు గర్వకారణమని వ్యాఖ్య

Minister Avanthi Grand Welcome to First Flight Passengers : కర్నూల్ నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ ప్యాసింజర్స్ కి టూరిజం శాఖ మంత్రి అవంతి..

కర్నూల్ నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ పాసింజర్స్ కి అవంతి గ్రాండ్‌ వెల్ కం, రాష్ట్రంలో 6 ఎయిర్‌పోర్టులు గర్వకారణమని వ్యాఖ్య
Avanthi Vsp Airport Kurnool

Updated on: Mar 28, 2021 | 4:56 PM

Minister Avanthi Grand Welcome to First Flight Passengers : కర్నూల్ నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ ప్యాసింజర్స్ కి టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఏపీలో మూడు రాజధానుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర- రాయలసీమని కలుపుతూ విమానాలు నడిపించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనత అని అవంతి చెప్పుకొచ్చారు. కర్నూలులో ఎయిర్‌ పోర్టు ఏర్పాటు వల్ల టూరిజంతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడతాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 6 ఎయిర్ పోర్టులు ఉండడం గర్వకారణమని టూరిజం మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి ఉజ్వల భవిష్యత్ ఉందన్న అవంతి.. రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల కర్నూలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని అవంతి అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us