డ్రాగన్ కంట్రీకి భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

|

Aug 24, 2020 | 5:48 PM

మీన వేషాలు వేసే డ్రాగన్ కంత్రీ కంట్రీకి భారత ఆర్మీ చీఫ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఛీఫ్ ఆఫ్ ఢిపెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ చైనా వ్యవహారంపై మండిపడ్డారు.

డ్రాగన్ కంట్రీకి భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
Follow us on

మీన వేషాలు వేసే డ్రాగన్ కంత్రీ కంట్రీకి భారత ఆర్మీ చీఫ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఛీఫ్ ఆఫ్ ఢిపెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ చైనా వ్యవహారంపై మండిపడ్డారు. చైనా ఆర్మీ అతిక్రమణలను ఎదుర్కోడానికి చర్చల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నా.. డ్రాగన్ కంట్రీ కుయుక్తులకు ప్రయత్నిస్తుందన్నారు. చర్చలు సఫలం కాకపోతే మాత్రం మిలటరీ యాక్షన్‌కు భారత సైన్యం సిద్ధంగానే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిలటరీ యాక్షన్ ప్రతిపాదన తమ వద్ద సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. చైనా జిత్తులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

‘‘ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైనే భిన్నాభిప్రాయాలు. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుతంగానే పరిష్కారం కోరుతోంది. ఎల్‌ఏసీ వెంట యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి ఈ ప్రయత్నాలు సఫలం కాకపోతే మాత్రం సైనిక చర్యలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం’’ అని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పరిస్థితులను శాంతి యుతంగా పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని రావత్ వెల్లడించారు.