బీబీ రెస్టారెంట్ టాస్క్ మిక్డ్స్ ఎమోషన్స్ మధ్య సాగింది. అటు రిచ్ కిడ్స్, ఇటు రెస్టారెంట్ స్టాఫ్ ఎత్తులకు, పై ఎత్తులు వేసి సత్తా చాటారు. అయితే టాస్క్ జరుగుతున్నప్పుడు మధ్యలో మెహబూబ్ కాస్త లైన్ క్రాస్ చేశాడు. దీంతో కాసేపు హౌస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అవినాష్ సీక్రెట్ టాస్క్‌లో భాగంగా చేసిన పనులతో వాతవరణం వేడెక్కింది. రెస్టారెంట్ సర్వీస్ బాగోలేదని మెహబూబ్ స్టాఫ్‌కు చెప్పడంతో, వారు అతడి మాటలని లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా అవినాష్ కామెడీగా చెప్పిన సమాధానాలకు విసిగిపోయిన మెహబూబ్ నా జోలికి వస్తే పుచ్చెలు పగిలిపోతాయి అని ఘాటు పదాలు ఉపయోగించాడు. దీంతో అక్కడే ఉన్న అఖిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఏం మాట్లాడుతున్నావ్.. ఇదే మాట రెండో సారి అన్నావు… పరిధిలో ఉండాలి’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అవినాష్ కూడా మెహబూబ్ దగ్గరకు వచ్చి.. ‘మేం మగాళ్లమే. ఇక్కడ అందరూ ఆర్టిస్టులున్నారు. మనం మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. నీ కండలని చూసి ఎవడు భయపడడు. నటుడ్ని అన్న విషయం పక్కన పెడితే మేం కూడా రౌడీలమే. నీ రౌడీయిజం నీ ఊర్లో చూపించుకో. ఇక్కడ కాదు’… అంటూ కౌంటరిచ్చాడు. అయితే మెహబూబ్ .. పుచ్చె పగిలిపోతది అన్న మాటని రిచ్ కిడ్స్ టీమ్‌లో ఉన్న సోహైల్ కూడా సమర్థించలేదు. అంతా బాగా మాట్లాడావ్ కానీ ఆ పదం జనాల్లోకి తప్పుగా వెళ్తుంది అని చెప్పాడు. దీంతో మెహబూబ్.. అఖిల్, అభిజిత్‌ల దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు.
Also Read : హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్రైమ్ రేట్