జగన్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్.. ఎందుకంటే..?

ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు.. ఏపీ ముఖ్యమంత్రి

జగన్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్.. ఎందుకంటే..?

Edited By:

Updated on: May 24, 2020 | 4:24 PM

Chiranjeevi special thanks to AP CM YS Jagan: ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు.. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీ తరుపున మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు కలిగించే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్‌లో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందకు తనను కలవమని ఏపీ సీఎం జగన్ తనతో చెప్పినట్టు చిరంజీవి ట్వీట్ చేసారు. త్వరలో చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలకు సంబంధించిన వారితో కలిసి ఏపీ సీఎం జగన్‌తో చర్చించనున్నట్టు చిరంజీవి తెలిపారు.

మరోవైపు.. గత కొద్ది రోజులుగా చిరంజీవి చిత్ర పరిశ్రమకు సంబంధించిన మంచి చెడులపై స్పందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమ తరపున పేద కళాకారులను, సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిరంజీవి తన ఇంట్లో టాలీవుడ్‌ షూటింగ్స్‌కు సంబంధించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చర్చించిన సంగతి విదితమే.

[svt-event date=”24/05/2020,4:05PM” class=”svt-cd-green” ]

Also Read: రైతులకు శుభవార్త: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు!