AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర.. నాందేడ్ లో ఇద్దరు సాధువుల దారుణ హత్య

మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. బాలబ్రహ్మచారి శివాచార్యను, ఆయన శిష్యుడుగా భావిస్తున్న భగవాన్ షిండేని  .. ఉమ్రి తాలూకాలోని వారి  ఆశ్రమంలోనే  దుండగులు హత్య చేశారని పోలీసులు తెలిపారు.  ఆశ్రమంలోని బాత్ రూమ్ వద్ద వీరి మృతదేహాలను కనుగొన్నట్టు వారు చెప్పారు. ఆశ్రమంలోని వస్తువులను దోపిడీ చేయడానికే దుండగులు ఇందులో ప్రవేశించారని, వారిని ఎదిరించబోయిన శివాచార్య ను గొంతు నులిమి హతమార్చారని, ఈ హత్యాకాండను కళ్లారా చూసిన భగవాన్ షిండే ని […]

మహారాష్ట్ర.. నాందేడ్ లో ఇద్దరు సాధువుల దారుణ హత్య
Umakanth Rao
| Edited By: |

Updated on: May 24, 2020 | 4:55 PM

Share

మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. బాలబ్రహ్మచారి శివాచార్యను, ఆయన శిష్యుడుగా భావిస్తున్న భగవాన్ షిండేని  .. ఉమ్రి తాలూకాలోని వారి  ఆశ్రమంలోనే  దుండగులు హత్య చేశారని పోలీసులు తెలిపారు.  ఆశ్రమంలోని బాత్ రూమ్ వద్ద వీరి మృతదేహాలను కనుగొన్నట్టు వారు చెప్పారు. ఆశ్రమంలోని వస్తువులను దోపిడీ చేయడానికే దుండగులు ఇందులో ప్రవేశించారని, వారిని ఎదిరించబోయిన శివాచార్య ను గొంతు నులిమి హతమార్చారని, ఈ హత్యాకాండను కళ్లారా చూసిన భగవాన్ షిండే ని కూడా హత్య చేసినట్టు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దుండగులు ఆశ్రమం నుంచి లక్షన్నర విలువైన వస్తువులను దోపిడీ చేయడమే గాక శివాచార్య వినియోగించే కారు తాళాలను కూడా బలవంతంగా లాక్కున్నారని ఖాకీలు వెల్లడించారు. దోపిడీ చేసిన వస్తువుల్లో 69 వేల రూపాయల విలువైన లాప్ టాప్ కూడా ఉందన్నారు. దొంగలు సాధువుకు చెందిన కారులోనే పారిపోతుండగా ఆశ్రమ గేటు వద్ద కారు ఆగిపోయిందని, ఆశ్రమంలోని ఇతరులంతా పరుగెత్తుకు వచ్ఛేసరికి టూ వీలర్ పై పరారయ్యారని తెలుస్తోంది.  ఈ కేసుకు సంబంధించి సాయినాథ్ శింగాడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు క్రిమినల్స్ కోసం అయిదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

కర్ణాటకకు చెందిన శివాచార్య కొన్నేళ్ళక్రితమే నాందేడ్ వచ్చారని,  ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంత అభివృధ్దికి తోడ్పడ్డారని తెలియవచ్చింది. మహారాష్ట్రలోనే ఆ మధ్య పాల్గర్ జిల్లాల్లో ఇద్దరు సాధువులను స్థానికులు దారుణంగా కర్రలు, రాళ్లతో కొట్టి చంపిన ఘటన మరువక ముందే ఈ ఇద్దరు సాధువుల హత్య తీవ్ర కలకలం రేపుతోంది.

Follow Us
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?