సూపర్ స్టార్‌ ఈవెంట్‌కి గెస్ట్‌గా మెగాస్టార్!

| Edited By:

Jan 05, 2020 | 11:37 AM

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవలే.. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన లుక్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా.. మహేష్ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించిన ఫొటోస్ అయితే కేక పుట్టించాయి. కాగా.. ఈరోజు సాయంత్రం సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో […]

సూపర్ స్టార్‌ ఈవెంట్‌కి గెస్ట్‌గా మెగాస్టార్!
Follow us on

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవలే.. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన లుక్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా.. మహేష్ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించిన ఫొటోస్ అయితే కేక పుట్టించాయి. కాగా.. ఈరోజు సాయంత్రం సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా విచ్చేయనున్నారు. చిరు రాకతో.. ఈ ఈవెంట్‌కి మరింత హైప్ వస్తుందనే చెప్పాలి.

కాగా.. ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌(డాంగ్ డాంగ్)లో మెరవనుంది. అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.