ఏపీ స్టేట్‌ హ్యూమన్‌ రైట్స్ కమిషన్‌ చైర్మన్‌ ఎంపికపై భేటీ.. సీఎం జగన్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రతిపక్ష నేతలు

|

Mar 17, 2021 | 10:17 AM

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి కాసేపట్లో సీఎం జగన్మోహన్‌రెడ్డి చేరుకోనున్నారు. ముఖ్య మంత్రి అధ్యక్షతన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎంపిక కమిటీ సమావేశం..

ఏపీ స్టేట్‌ హ్యూమన్‌ రైట్స్ కమిషన్‌ చైర్మన్‌ ఎంపికపై భేటీ.. సీఎం జగన్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రతిపక్ష నేతలు
CM YS Jagan Review Meeting
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి కాసేపట్లో సీఎం జగన్మోహన్‌రెడ్డి చేరుకోనున్నారు. ముఖ్య మంత్రి అధ్యక్షతన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎంపిక కమిటీ సమావేశం కానుంది. చైర్మన్ ఎంపిక కమిటీ సమావేశానికి హాజరుకావాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా, ఇతర కమిటీ సభ్యులకు ప్రభుత్వ ఇప్పటికే ఆహ్వానం పంపింది.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ ఎంపిక కమిటీలో సభ్యులుగా మండలి ఛైర్మన్‌, స్పీకర్, హోం మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత, శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే చైర్మన్ ఎంపిక కమిటీ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కాకూడదని ప్రతిపక్ష నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సమావేశం తరువాత ఎంపిక కమిటీ తమ నిర్ణయాన్ని గవర్నర్‌కు ప్రతిపాదిస్తారు. అనంతరం ఎంపీక కమిటీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వారిని మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్ గా గవర్నర్‌ నియమిస్తారు.

అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ పాల్గొంటారు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సెఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా మహమ్మారి కట్టడిపై సీఎంలతో పీఎం చర్చించనున్నారు. ఏపీలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More:

జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ.. కృష్ణా నదీజలాల వివాదంపై తెలంగాణ తరపు సాక్షుల హాజరు

సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ… బడ్జెట్‌కు ఆమోద ముద్ర.. ఆ కీలక నిర్ణయాలకు పచ్చజెండా..?