మెడికల్‌ కాలేజీలో.. ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై లోని ప్రభుత్వ స్టాన్లీ వైద్యకళాశాల ఆసుపత్రిలో సేవలందిస్తున్న

మెడికల్‌ కాలేజీలో.. ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌..

Updated on: Jun 26, 2020 | 9:47 AM

Medical college interns: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై లోని ప్రభుత్వ స్టాన్లీ వైద్యకళాశాల ఆసుపత్రిలో సేవలందిస్తున్న ఏడుగురు వైద్యవిద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. గత కొంతకాలంగా వైద్యసేవలందిస్తున్న వైద్యవిద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా, వీరిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని రావడంతో వారిని అయినవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించామని వైద్యులు తెలిపారు.

చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి, మద్రాస్ మెడికల్ కాలేజీ, కిల్పాక్ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రి, ఒమన్ దురార్ ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పలువురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారందరినీ క్వారంటైన్ చేశారు.

Also Read: జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us