వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిత్యం మాట్లాడే బీఎస్పీ అధినేత్రి మాయావతి తన సోదరడు కుమార్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. లక్నోలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. లోక్‌సభలో పార్టీ నేతగా అమ్రోహ ఎంపీ దానిష్ అలీని నియమించారు. కాగా మాయావతి తన వారసుడిగా సోదరుడి కుమారుడు ఆకాష్‌ను ప్రోత్సహిస్తున్నారని బీఎస్పీ వర్గాలు పేర్కొన్నాయి. పలు పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొంటుండటం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.
Danish Ali has been elected as the leader of BSP in Lok Sabha. Anand Kumar appointed as the Vice President of the party. Akash Anand and Ramji Gautam to be the National Coordinator of BSP. pic.twitter.com/s5FvENI98u
— ANI (@ANI) June 23, 2019