‘స్లీప్ బాక్స్’.. భార్య నిద్ర కోసం మార్క్‌ గారి ఇన్వెన్షన్

| Edited By:

Apr 29, 2019 | 1:02 PM

తన భార్య ప్రిసిల్లా సరిగా నిద్రపోవడం లేదని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్‌కు బెంగ పట్టుకుంది. తమ పిల్లల కోసం ఆమె ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ నిద్ర లేమితో ఒత్తిడికి గురౌతోందని ఆయన తెగ ఫీల్ అయ్యాడు. దీంతో తన టాలెంట్‌తో ఓ ‘స్లీప్ బాక్స్‌’ను తయారుచేశాడు మార్క్. దానికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆ బాక్స్ విశేషాలను కూడా ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఉదయం […]

‘స్లీప్ బాక్స్’.. భార్య నిద్ర కోసం మార్క్‌ గారి ఇన్వెన్షన్
Follow us on

తన భార్య ప్రిసిల్లా సరిగా నిద్రపోవడం లేదని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్‌కు బెంగ పట్టుకుంది. తమ పిల్లల కోసం ఆమె ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ నిద్ర లేమితో ఒత్తిడికి గురౌతోందని ఆయన తెగ ఫీల్ అయ్యాడు. దీంతో తన టాలెంట్‌తో ఓ ‘స్లీప్ బాక్స్‌’ను తయారుచేశాడు మార్క్. దానికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆ బాక్స్ విశేషాలను కూడా ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు.

ఉదయం పూట వారి కుమార్తెలు సాధారణంగా 6గం.ల నుంచి 7గం.ల మధ్య లేస్తారట. ఆ సమయంలో ఈ బాక్స్‌లో ఉన్న లైట్ చిన్న కాంతితో వెలుగుతుందట. అది సమయాన్ని చూపదని, దాని వలన ప్రిసిల్లా ఒత్తిడికి గురవ్వదని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ ఆమె మధ్యరాత్రిలో లేచినా.. సమయం ఎంత అన్న విషయం చూసుకోవాల్సిన అవసరం లేకుండా తిరిగి ఈ బాక్స్ వలన సుఖంగా నిద్రలోకి జారుకోగలదని అంటున్నాడు. మొత్తానికి ఈ స్లీప్ బాక్స్ వల్ల తన భార్యకు గాఢనిద్ర సౌఖ్యం తథ్యమని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ రకంగా తాను ఆమె పట్ల ప్రేమానురాగాలను చూపగలుగుతున్నానని సంబరపడ్డాడు. ఇక ఇలాంటి బాక్స్‌లు తమకు కూడా కావాలని తన స్నేహితులు కోరారని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపాడు. కాగా దీనిపై బ్రిటీష్ సింగర్ లిల్లీ అలెన్ స్పందిస్తూ.. అందులో తెల్లవారి ఆధిపత్యాన్ని తగ్గించేలా ఏదైనా ప్రక్రియ ఉందా..? అంటూ కామెంట్ పెట్టారు.