జీవితా రాజశేఖర్.. పేరులోనే కాదు నిజజీవితంలోనూ వీరిద్దరూ ఎక్కడున్నా కలిసే వుంటారు. అప్పటికి ఇప్పటికి టాలీవుడ్‌లో వీరి గురించి తెలియనవారే లేరు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి జీవితంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. సినిమా కథను తలపిస్తూ వీరి ప్రేమ, పెళ్లిలో చాలా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత.. తన భర్త రాజశేఖర్‌తో అనుబంధం.. ప్రేమ.. పెళ్లిపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
తానెప్పుడూ అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉండేదాన్నని అందుకే రాజశేఖర్ గారికి తనమీద ప్రేమ తగ్గిపోతుందని ఎప్పుడు అనిపించలేదన్నారు జీవితా రాజశేఖర్. అప్పటికి ఇప్పటికి తాను ఎప్పుడు లైఫ్‌లో సక్సెస్‌గా ఉన్నానని చెప్పారు. రాజశేఖర్‌లో తనకు నచ్చిన విషయం ఏదైనా తనతో షేర్ చేసుకునేవారట. ఆఖరికి ఎవరైనా అమ్మాయి ఫోన్ చేసి రమ్మని చెప్పినా.. తనకు చెప్పేవారిని అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయని చెప్పారు.
తామిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకునేవాళ్లట. కాని అందరిని ఒప్పించి చేసుకోవాలని అనుకున్నామని జీవిత చెప్పారు. అయితే పెళ్లికి ముందు నవభారతం సినిమాలో నటించే టైంలో ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండేవాళ్లమని.. పక్క పక్క గదులు ఉన్నా సరే తాము ఒకే గదిలో ఉండేవారమని అన్నారు. అలా తాము కలిసి ఉండటం వల్ల.. ఇండస్ట్రీలో చాలా చర్చలు జరిగేవని చెప్పారు. అయితే పెళ్లి అవుతుందా లేదా..? ఇద్దరం పెళ్లి చేసుకోకపోతే నవ్వులపాలైపోతాం అని ఎప్పుడూ అనుకోలేదు. తన తల్లిదండ్రులు కూడా బాధపడేవాళ్లని అన్నారు. కాగా, ఎన్నో మలుపులు, ట్విస్టుల తరువాత తమ ఇద్దరికి పెళ్లి జరిగిందని చెప్పారు.