మణిపూర్‌లో రికార్డు స్థాయిలో.. ఇవాళ 192 కరోనా పాజిటివ్ కేసులు!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు

మణిపూర్‌లో రికార్డు స్థాయిలో.. ఇవాళ 192 కరోనా పాజిటివ్ కేసులు!

Edited By:

Updated on: Aug 15, 2020 | 7:58 PM

Manipur reports highest: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4,390కి చేరినట్టు పేర్కొంది. మొత్తం కేసులో 1,939 పాజిటివ్ కేసులు ఉండగా, 2,438 మంది పూర్తి స్వస్థతతో డిశ్చార్జి అయ్యారని, మృతుల సంఖ్య 13కి చేరిందని తెలిపింది. రికవరీ రేటు 55.53 శాతంగా ఉందని వెల్లడించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ పొడిగించింది.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!