అదృష్టం అంటే ఇది.. ఒక్క దెబ్బకు 25 లాటరీలు..

|

Aug 06, 2020 | 10:55 PM

అద‌ృష్టం అంటే ఇలా ఉండాలి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు.. ఇతడిని చూసి ఒక్క దెబ్బకు 25 లాటరీలు అని మార్చాలేమో. ఎందుకుంటే.. అదృష్టానికి అడ్రస్ అతడు, అదృష్ట దేవ‌త అతడి తలుపును ఒక్క సారి తట్టలేదు.. ఏకంగా 25 సార్లు కొట్టింది. ఎందుకంటే.. అత‌ను ఏకంగా 25 లాట‌రీలు గెలుపొందాడు. ల‌క్ ల‌క్క‌లా అతుక్కున్న ఈ వ్య‌క్తి పేరు రేమండ్ హారింగ్‌ట‌న్‌. ఈ అదృష్ట వంతుడు ఉండేది అమెరికాలోని వ‌ర్జీనియా ప్రాంతంలో. ఓ రోజు […]

అదృష్టం అంటే ఇది.. ఒక్క దెబ్బకు 25 లాటరీలు..
Follow us on

అద‌ృష్టం అంటే ఇలా ఉండాలి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు.. ఇతడిని చూసి ఒక్క దెబ్బకు 25 లాటరీలు అని మార్చాలేమో. ఎందుకుంటే.. అదృష్టానికి అడ్రస్ అతడు, అదృష్ట దేవ‌త అతడి తలుపును ఒక్క సారి తట్టలేదు.. ఏకంగా 25 సార్లు కొట్టింది. ఎందుకంటే.. అత‌ను ఏకంగా 25 లాట‌రీలు గెలుపొందాడు. ల‌క్ ల‌క్క‌లా అతుక్కున్న ఈ వ్య‌క్తి పేరు రేమండ్ హారింగ్‌ట‌న్‌. ఈ అదృష్ట వంతుడు ఉండేది అమెరికాలోని వ‌ర్జీనియా ప్రాంతంలో. ఓ రోజు స‌ర‌దాగా బీచ్‌కు వెళ్ల‌గా అక్క‌డి వేగ్న‌మ్ దుకాణంలో 25 డాల‌ర్లు వెచ్చించి 25 లాట‌రీ టికెట్లు కొనుగోలు చేశాడు.

తీరా ఏమాత్రం లెక్క త‌ప్ప‌కుండా అత‌ను కొనుగోలు చేసిన 25 టికెట్లు అన్నీ కూడా లాట‌రీను గెలుచుకున్నాయి. ప్ర‌తి టికెట్‌కు 5 వేల డాల‌ర్లు వచ్చాయి. ఈ లెక్క‌న అత‌ను మొత్తంగా 1,25,000 డాల‌ర్లు గెలుచుకున్నాడు. దీంతో తొలుత అవాక్క‌యిన అత‌ను త‌ర్వాత సంతోషంలో మునిగి పోయాడు. ఈ డ‌బ్బును త‌న కొడుకుల‌ చదువుల‌కు ఖ‌ర్చు పెడ‌తాన‌ని, త‌ద్వారా వారికి మంచి భ‌విష్య‌త్తును అందించేందుకు ఉప‌యోగిస్తానని అంటున్నాడు రేమండ్ హారింగ్‌టన్.