షాకింగ్: 81 ఏళ్ళ వృద్ధురాలిని పెళ్లాడిన యువకుడు
ఉక్రెయిన్‌లోని పౌరులందరికి నిర్బంద సైనిక శిక్షణ అనేది తప్పనిసరి. ఇక దీని నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు తన పెళ్లి విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 81 ఏళ్ళ వృద్ధురాలిని పెళ్లాడాడు. వివరాల్లోకి వెళ్తే.. అలెగ్జాండర్ కొండ్రాట్యుక్(24) అనే యువకుడు తన బంధువైన జినైడా ఇల్లారియోనోవ్నా(81) అనే వృద్ధురాలిని వివాహం చేసుకున్నాడు. అలెగ్జాండర్ ఇలా వృద్ధురాలిని పెళ్లి చేసుకోవడంతో సైనిక శిక్షణను తప్పించుకున్నాడు. ఎందుకంటే భార్య ఏదైనా వైకల్యంతో ఉంటే సైనిక సేవ నుంచి […]
ఉక్రెయిన్‌లోని పౌరులందరికి నిర్బంద సైనిక శిక్షణ అనేది తప్పనిసరి. ఇక దీని నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు తన పెళ్లి విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 81 ఏళ్ళ వృద్ధురాలిని పెళ్లాడాడు. వివరాల్లోకి వెళ్తే.. అలెగ్జాండర్ కొండ్రాట్యుక్(24) అనే యువకుడు తన బంధువైన జినైడా ఇల్లారియోనోవ్నా(81) అనే వృద్ధురాలిని వివాహం చేసుకున్నాడు. అలెగ్జాండర్ ఇలా వృద్ధురాలిని పెళ్లి చేసుకోవడంతో సైనిక శిక్షణను తప్పించుకున్నాడు. ఎందుకంటే భార్య ఏదైనా వైకల్యంతో ఉంటే సైనిక సేవ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ లాజిక్‌ను మనోడు వాడుకుని ఎంచక్కా అందరిని బురిడీ కొట్టించాడు.
తన భార్య జినైడాకు వయో భారంతో పాటు కంటిచూపు సరిగ్గాలేదని ధృవపత్రాలు కూడా సృష్టించుకున్నాడు. ఇక అధికారులు అలెగ్జాండర్‌ను సైనిక సేవ గురించి అడిగితే మ్యారెజ్ సర్టిఫికేట్ చూపిస్తున్నాడట. అటు భార్య జినైడాను అడిగితే భర్త అలెగ్జాండర్ తనను బాగా చూసుకుంటున్నాడని చెప్పేదట. దాంతో సైనికాధికారులు ఏమి చేయలేక తిరుగు ముఖం పడుతున్నారు. ఇలా సైనిక సేవ నుంచి తప్పించుకోవడానికి అలెగ్జాండర్ చేసిన పనిని దేశపౌరులు కూడా అనుసరిస్తే పరిస్థితి ఏంటని ఆ దేశ సైనికాధికారులు చర్చించుకుంటున్నారట. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.