కరోనా పరీక్షలు చేయించుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. యూఏఈలో జరిగే ఐపీఎల్ 13 కోసం క్రికెటర్లు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాంచీలో ధోనీ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది. మరో టీమ్ సభ్యుడు మెనూ సింగ్‌తో కలిసి రాంచీలో కరోనా టెస్ట్‌కు శాంపిల్స్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రానికి ధోనీ కరోనా టెస్టుల ఫలితాలు రానున్నాయి. ఈ పరీక్షల్లో నెగిటివ్ వస్తే ధోనీ చెన్నై బయలు దేరి వెళ్లనున్నారు. యూఏఈ వేదికగా ఐపీఎల్ తాజా సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. ఈ నెల మూడో వారంలో చెన్నై జట్టు యూఏఈ వెళ్లనుంది. కాగా వ్యక్తిగత కారణాలతో రవీంద్ర జడేజా సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరలో పాల్గొనడం లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపారు.
కాగా ఆగష్టు 15వ తేదీ నుంచి ఆగష్టు 20వ తేదీ వరకు ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై జట్టు క్యాంప్ నిర్వహించనున్నది. ఈ క్యాంపుకు బౌలింగ్ కోచ్ ఎల్ బాలీజీ నేతృత్వం వహిస్తాడు. ధోనీ, రైనా, పీయూష్ చావ్లాతో పాటు మరో 8 మంది తమిళనాడు క్రికెటర్లు యూఏఈ వెళ్లేందుకు సెలెక్ట్ అయ్యారు. ఇక ఐపీఎల్ ఆడగాళ్లు ఎవరైనా అక్కడికి వెళ్తే ముందు రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకోవాలి. అలాగే అక్కడికి వెళ్లాక కూడా పలుమార్లు టెస్టులు చేస్తారనే విషయం తెలిసిందే.
Read More:
అభిరామ్ యాక్సిడెంట్ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీ
ఈ రోజు రాత్రి 8 గంటలకు మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం
బిగ్‌బాస్ సీజన్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జరుగుతుందో?