పతంజలికి భారీ షాక్…కరోనిల్​పై మహారాష్ట్ర స‌ర్కార్ నిషేధం..!

|

Jun 25, 2020 | 9:38 PM

క‌రోనా ఔషధం పేరిట భార‌‌త‌ ఆయుర్వేద సంస్థ ​పతంజలి తీసుకొచ్చిన 'కరోనిల్' మందు అమ్మకాలను మహారాష్ట్ర గ‌వ‌ర్న‌మెంట్ బ్యాన్ చేసింది. వెంట‌నే ఈ నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది.

పతంజలికి భారీ షాక్...కరోనిల్​పై మహారాష్ట్ర స‌ర్కార్ నిషేధం..!
Follow us on

మ‌హ‌మ్మారి కరోనాకు మెడిసిన్, వ్యాక్సిన్ క‌నుగొనేందుకు ప్ర‌పంచంలోని చాలా దేశాల సైంటిస్టులు ప్ర‌యోగాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అవి వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా ఔషధం పేరిట భార‌‌త‌ ఆయుర్వేద సంస్థ ​పతంజలి తీసుకొచ్చిన ‘కరోనిల్’ మందు అమ్మకాలను మహారాష్ట్ర గ‌వ‌ర్న‌మెంట్ బ్యాన్ చేసింది. వెంట‌నే ఈ నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది. ఈ ఔషధం నకిలీదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ మండిప‌డ్డారు. పతంజలి అసలు క్లినికల్ ట్రయల్స్ చేసిందో లేదో జైపుర్ నిమ్స్ తేల్చ‌బోతుంద‌ని ట్వీట్ చేశారు. నకిలీ మందుల అమ్మకాన్ని మహారాష్ట్ర స‌ర్కార్ అనుమతించదంటూ రాందేవ్​ బాబాకు వార్నింగ్ ఇచ్చారు.


మంత్రి కామెంట్స్ పై బీజేపీ ఎమ్మెల్యే రామ్​దాస్​ కదమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రీట్మెంట్ కోసం తయారు చేసిన ఔషధాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా నకిలీదని ఎలా నిర్దారిస్తార‌ని ప్రశ్నించారు. బాబా రాందేవ్ ఎప్పటినుంచో భ‌ర‌త‌మాత‌కు సేవచేస్తున్నారని పేర్కొన్నారు.

కరోనాకు ఆయుర్వేద మెడిసిన్ తీసుకువచ్చినట్లు పతంజలి మంగళవారం పత్రికాముఖంగా ప్రకటించింది. ‘కరోనిల్‌’ పేరుతో ఈ మెడిసిన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పతంజలి కో ఫౌండ‌ర్ బాబా రాందేవ్‌ కరోనిల్‌ను ఆవిష్కరించారు. అయితే.. కరోనా ఔషధాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు పతంజలి మీడియాలో ప్రకటించడాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తప్పుబట్టింది. ఔషధ ప‌ర్మిష‌న్ పేప‌ర్స్ సమర్పించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలిని కోరింది. పూర్తి స్థాయిలో ప‌ర్మిష‌న్స్ వచ్చేవరకు మందులపై ప్రకటనలను నిలిపివేయాలని సూచించింది.