Shivaratri 2020: ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు.. కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు..!

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 4:42 PM

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలను ఆచరిస్తోన్న భక్తులు, శివాలయాలకు చేరుకొని మహా శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. శివనామస్మరణ చేస్తూ తమ కోరికలు తీర్చాలంటూ ఆ భోళా శంకరుడికి

Shivaratri 2020: ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు.. కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు..!
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలను ఆచరిస్తోన్న భక్తులు, శివాలయాలకు చేరుకొని మహా శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. శివనామస్మరణ చేస్తూ తమ కోరికలు తీర్చాలంటూ ఆ భోళా శంకరుడికి విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాలయాల్నీ కిటకిటలాడుతున్నాయి.

శ్రీశైలం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, ద్రాక్షారామం, సోమారామం, సామర్లకోట, కోటప్పకొండ, అమరావతి, పట్టిసీమ, సత్తా రామేశ్వరం, ఆచంట, కొవ్వూరు, ద్వారకా తిరుమల శేషాచల కొండ తదితర ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్య క్షేత్రాలకు భారీగా చేరుకుంటోన్న భక్తులు, ఆది దేవుడిని స్మరణలో ముగ్ధులవుతున్నారు.