సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శుభవార్త

|

Aug 11, 2020 | 5:24 PM

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు శుభవార్త ప్రకటించింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ జైళ్లలో ఉన్న 244 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శుభవార్త
Follow us on

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు శుభవార్త ప్రకటించింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ జైళ్లలో ఉన్న 244 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు విముక్తి కలిగించనున్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఎంపిక చేసి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న విడుదల చేస్తుంటారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు వివిధ జైళ్లలో ఉన్న 244 మంది ఖైదీలను విడుదల చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఈ పని చేస్తోంది. ఉత్తమ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం మామూలేనని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు.

సమాజంలో వివిధ నేరాలను చేసి శిక్షలు పడిన వారిని ముందుగా ఎంపికచేస్తారు. వారు ఎంత కాలం నుంచి జైలులో ఉన్నారు. వారిపై నమోదైన కేసులు దాని తీవ్రత గమనిస్తారు. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు శిక్షను అనుభవించారు. జైలు నియమాలు తుచ తప్పకుండా పాటించిన వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. జైలులో ఉన్న సమయంలో ఇతరులతో ప్రవర్తించే తీరును గమనిస్తారు. ఇలా పలు కోణాల్లో వారి ప్రవర్తనాశైలిని పూర్తిగా పరిశీలించి అన్నింట్లో సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలను విడుదలకు ఎంపిక చేస్తారు. శిక్ష పడి జైలులో ఉన్నంత కాలం వీరిపై జైలు అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించి జాబితాను రూపొందిస్తారు.