‘మా’లో మళ్లీ లొల్లి షురూ! నరేష్‌పై చర్యలు తీసుకోవాల్సిందే

| Edited By:

Jan 28, 2020 | 1:25 PM

‘మా’లో మళ్లీ లొల్లి షురూ అయ్యింది. మా అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా’ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై నరేష్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. నరేష్ లోపాలను తప్పుబడుతూ క్రమశిక్షణ సంఘానికి 10 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో 15 మంది ఈసీ కమిటీ సభ్యులు కూడా సంతకం చేశారు. గతంలో శివాజీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. నరేష్ […]

మాలో మళ్లీ లొల్లి షురూ! నరేష్‌పై చర్యలు తీసుకోవాల్సిందే
Follow us on

‘మా’లో మళ్లీ లొల్లి షురూ అయ్యింది. మా అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా’ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై నరేష్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. నరేష్ లోపాలను తప్పుబడుతూ క్రమశిక్షణ సంఘానికి 10 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో 15 మంది ఈసీ కమిటీ సభ్యులు కూడా సంతకం చేశారు. గతంలో శివాజీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. నరేష్ కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వారు ఏం చేశారో.. అంతా ఈ 10 పేజీల లేఖలో పేర్కొన్నామన్నారు.

దయచేసి క్రమ శిక్షణ సంఘం నరేష్‌ వ్యవహారంపై చర్చలు జరిపి సరైన చర్య తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్‌పై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి జీవిత విజ్ఞప్తి చేశారు. నరేష్ తాను తీసుకుంటోన్న నిర్ణయాలతో ‘మా’ను పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని, మా సభ్యులు ఆస్పత్రిలో ఉంటే కనీసం పరామర్శ కూడా చేయలేదని వ్యాఖ్యానించారు జీవిత. కాగా.. డిసిప్లెయిన్ కమిటీలో ప్రముఖ సీనియర్ నటులు కృష్ణం రాజు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధలు ఉన్నారు. దీనిపై మరి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.