కరోనా వైరస్‌కు అల్ట్రా వయెలెట్‌ కిరణాలతో బ్రేకప్…పరిశోధనల్లో సంచలన నిజాలు..

|

Dec 16, 2020 | 10:27 PM

అల్ట్రా వయెలెట్‌ కిరణాలతో కరోనా వైరస్‌ చనిపోతుందని శాస్త్రవేత్తలు ఇదివరకే నిరూపించారు. అయితే ఎల్‌ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయెలెట్‌ కిరణాలతో కూడా వైరస్‌ను 99.9 శాతం చంపవచ్చని ఇజ్రాయెల్‌లోని టెల్‌...

కరోనా వైరస్‌కు అల్ట్రా వయెలెట్‌ కిరణాలతో బ్రేకప్...పరిశోధనల్లో సంచలన నిజాలు..
Follow us on

LED Light Can Kill : పరిశోధకుల ముందు కోవిడ్-19 పెద్ద ప్రశ్నగా మారింది. దీనిని నియంత్రించేది ఎలా.. ? అడ్డుకట్ట వేడయం ఎలా ?.. ఇలాంటి బోలెడు ప్రశ్నలతో ముందుకు సాగుతున్నారు పరిశోధకులు. ఇప్పుడు తాజాగో మరో పరిశోధన ఫలితాన్ని సైంటిస్టులు విడుదల చేశారు. ఎల్ఈడీ లైట్లతో అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు.

అల్ట్రా వయెలెట్‌ కిరణాలతో కరోనా వైరస్‌ చనిపోతుందని శాస్త్రవేత్తలు ఇదివరకే నిరూపించారు. అయితే ఎల్‌ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయెలెట్‌ కిరణాలతో కూడా వైరస్‌ను 99.9 శాతం చంపవచ్చని ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్‌ హదాస్‌ మమేన్‌ మొదటి సారి నిరూపించారు.

గదుల్లో, ఇళ్లలో కరోనా వైరస్‌ లేకుండా చేయడానికి వెంటిలేటర్ల వద్ద, ఏసీ గదుల్లో గాలీ పీల్చుకునే ఏసీ వెంటిలేటర్ల వద్ద ఎల్‌ఈడీ బల్బులను అమర్చుకోవాలని, బస్సుల్లో, రైళ్లలో, క్రీడా ప్రాంగణాల్లో శాస్త్రీయంగా ఆలోచించి ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలని ఆయన సూచించారు.

మార్కెట్లో అందుబాటులో ఉన్న చౌక ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించే తాము విజయవంతంగా కరోనా వైరస్‌ను అంతం చేయగలిగామని ప్రొఫెసర్‌ హదాస్‌ మమేన్‌ వివరించారు. చౌకైనా ఎయర్‌ ప్రెషర్స్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించడం ద్వారా కూడా ఈ వైరస్‌ను నిర్మూలించవచ్చని ఆయన చెప్పారు.