
సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీకి సీబీఐ కన్నా ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. రియా మొబైల్ ఫోన్లకు సంబంధించి క్లోనింగ్ చేసిన రెండు కాపీలను అధికారులు తీసుకోగా షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇందులో సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరందా ఇంటి నుంచి రియా సుశాంత్ డెబిట్ కార్డు పిన్ ని తీసుకున్నట్టు వారి మధ్య జరిగిన చాటింగ్ ద్వారా వెల్లడైంది. నిషిధ్ధ మార్జువానా, కొకైన్ కూడా రియా తీసుకునేదని, ఇందుకు సుశాంత్ సొమ్మును వాడుకునేదని తెలియవచ్చింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా ఈ విషయంలో తన సోదరితో బాటు సుశాంత్ కళ్ళు గప్పి ఈ డ్రగ్ తీసుకునేవాడట.. గత ఏప్రిల్ 17, మే 1 మధ్య రియా, శామ్యూల్ మధ్య జరిగిన సంభాషణను బట్టి చూస్తే 17 వేల రూపాయల విలువైన డ్రగ్ ని షోవిక్ తెప్పించుకున్నాడని తెలిసింది. ఇక తమ దర్యాప్తు అంశాలను ఈడీ అధికారులు సీబీఐతో పంచుకుంటున్నారు.