Largest Ever Colour Diamond in Russia : ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రం దొరికింది. ఇది అరుదైనదే కాదు అత్యంత పురాతనమైనది కావడంతో సంచలనంగా మారింది. రష్యాలో లభించిన ఈ వజ్రం విలువ కూడా అదేస్థాయిలో ఉంది. 236 క్యారెట్ల భారీ వజ్రం ఈ మధ్యే వెలుగు చూసింది. ఈ విషయాన్ని ప్రముఖ డైమండ్ కంపెనీ అల్రోసా వెల్లడించింది. యాకూటియాలోని తమ వజ్రపు గనుల్లో ఈ ముడివజ్రం దొరికినట్లు అల్రోసా తెలిపింది.
ఇప్పటి వరకూ రష్యాలో లభించిన ప్రకృతి సిద్ధ ముడివజ్రాల్లో ఇదే అతిపెద్దది అని ఈ సంస్థ ప్రకటించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ వజ్రం కనీసం 12-23కోట్ల సంవత్సరాల క్రితానిదని తెలుస్తోంది.