ఆంధ్రప్రదేశ్ లో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం భూ కేటాయింపులు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మండలంలో ఈ శిక్షణ అకాడమీకి భూమిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి 41 ఎకరాల 82 సెంట్ల భూమిని శిక్షణ సంస్థ కోసం కేటాయించారు. తిరుపతి అర్బన్ మండలంలోని చెన్నైగుంట గ్రామంలో ఈ భూమిని కేటాయిస్తున్నట్లు ఆదేశాల్లో వివరించారు. కాగా ఏపీలో భూముల రీ సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
ఏపీలో భూముల రీ సర్వేకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇందుకోసం సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యం అందిస్తుంది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియాతో జగన్ సర్కార్ ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read : Central Board of Indirect Taxes & Customs: జీఎస్టీ బిల్లులపై సీబీఐసీ వివరణ.. నిజానిజాలపై ట్వీట్…