Central Board of Indirect Taxes & Customs: జీఎస్టీ బిల్లులపై సీబీఐసీ వివరణ.. నిజానిజాలపై ట్వీట్…

జీఎస్టీ బిల్లులపై ప్రజల్లో ఉన్న అపోహలు, అవాస్తవాలను తొలగించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్‌స్, కస్టమ్స్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.

Central Board of Indirect Taxes & Customs: జీఎస్టీ బిల్లులపై సీబీఐసీ వివరణ.. నిజానిజాలపై ట్వీట్...
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2020 | 7:22 AM

జీఎస్టీ బిల్లులపై ప్రజల్లో ఉన్న అపోహలు, అవాస్తవాలను తొలగించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్‌స్, కస్టమ్స్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.

లా కమిటీ నోటిఫికేషన్….

జీఎస్టీ బిల్లుల్లో పెరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని, జీఎస్టీ కౌన్సిల్ లా కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సుమారు 12,000 నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 365 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. 6 వారాల్లో, సుమారు 165 నకిలీ కేసులలో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపింది.

ఊరికే రిజిస్ట్రేషన్ రద్దు చేయబడదు…

జీఎస్టీ పన్ను విధానంలో చెల్లింపుదారులకు పన్ను చెల్లింపునకు తగిన సమయం ఇవ్వబడుతుందని, ఊరికే రిజిస్ట్రేషన్ రద్దు చేయబడదని సీబీఐసీ తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ట్యాక్స్ ఎగవేత రుజువు అయినప్పుడు మాత్రమే జీఎస్టీ సస్పెన్షన్ ఉంటుందని పేర్కొంది.

ఒక్క శాతం చెల్లిస్తే సరిపోతుంది…

నెలవారీ రూ.50 లక్షలకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులు జీఎస్టీ కేవలం 1% నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధన గతంలో లేదని, ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్స్ అండ్ కస్టమ్స్ జీఎస్టీ నిబంధనలలో కొత్తగా రూల్ 86 బీని ప్రవేశపెట్టిందని పేర్కొంది. దీని ప్రకారం జీఎస్టీ చెల్లింపు దారులు వారి ఐటీసీని గరిష్టంగా 99 శాతం వరకు ఉపయోగించడానికి అనుమతి ఇస్తోంది.

జీఎస్టీ నంబర్‌ను చెక్ చేసుకోండిలా…

Https://www.gst.gov.in వెబ్‌సైట్‌ను తెరవండి. ఇప్పుడు సెర్చ్ టాక్స్ పేయర్ ఎంపికకు వెళ్లి… GSTIN / UIN ద్వారా సెర్చ్ పై క్లిక్ చేయండి. GST సంఖ్య తప్పు అయితే, సరైన సంఖ్యను నమోదు చేయమని చూపిస్తుంది. సంఖ్య సరైనది అయితే దాని స్థితి చూపబడుతుంది. ఇందులో వ్యాపారం పేరు, రాష్ట్రం, రిజిస్ట్రేషన్ తేదీ, వ్యాపారం రకం – ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వంటి వివరాలు ఉంటాయి.

జీఎస్టీ నెంబర్ పూర్తి వివరాలు…

GSTIN / UIN యొక్క మొదటి రెండు సంఖ్యలు స్టేట్ కోడ్ కోసం. దాని తర్వాత 10 అంకెలు వ్యాపార యజమాని లేదా దుకాణం యొక్క పాన్ సంఖ్య. మరో విషయం ఏంటంటే… దుకాణదారుడు మీకు 15 అంకెలు గల జీఎస్టి సంఖ్య లేని బిల్లు, చేతితో రాసిన బిల్లు ఇచ్చినట్లయితే మీకు లభించే బిల్లు నకిలీ కావచ్చు. అప్పుడు మీరు కస్టమర్ వాణిజ్య పన్ను విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.

సీబీఐసీ ట్వీట్ ఇదే…

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.