మునిసిపల్ అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ వెరైటీ స్టైల్

|

Dec 31, 2019 | 8:17 AM

ఏపీలో రాజధాని రగడ కొనసాగుతుంటే.. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది. జనవరి 22న జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మునిసిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. అయితే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్. తనదైన శైలిని ప్రదర్శించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కమిటీ సభ్యులతో […]

మునిసిపల్ అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ వెరైటీ స్టైల్
Follow us on

ఏపీలో రాజధాని రగడ కొనసాగుతుంటే.. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది. జనవరి 22న జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మునిసిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. అయితే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్. తనదైన శైలిని ప్రదర్శించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. మునిసిపల్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేటీఆర్. అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంలో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై కేటీఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులతో చర్చించారు.

అయితే ముందుగా అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారిన పరిస్థితిలో అందుకోసం కేటీఆర్ తనదైన శైలిలో కొత్త స్టైల్‌ని అనుసరించాలని భావిస్తున్నారు. గత అయిదేళ్ళలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కొత్తగా చేరిన పలువురితోపాటు మొదట్నించి టీఆర్ఎస్ పార్టీలో వున్న వారు పెద్ద ఎత్తున మునిసిపల్ ఎన్నికల్లో టిక్కెట్లను ఆశిస్తున్నారు. వీరిలో అసమ్మతి, అసంతృప్తి లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయడం కేటీఆర్ ముందు సవాల్‌గా మారింది.

రాష్ట్ర స్థాయిలో ముగ్గురితో త్రిమెన్ కమిటీని నియమించాలని కేటీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కమిటీ జిల్లాల వారీగా మునిసిపల్ అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసి, జిల్లా అధ్యక్షులకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. అనంతరం జిల్లా కమిటీలు మునిసిపల్ అభ్యర్థుల ఆశావహులను వడపోసి, జాబితాలను రూపొందిస్తారు.

ఆ తర్వాత రాష్ట్ర స్థాయి త్రిమెన్ కమిటీ ఆ జాబితాలను మరోసారి పరిశీలించి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తుది జాబితాను రూపొందిస్తుంది. తుది జాబితాపై అధినేత కేసీఆర్‌ అనుమతి తీసుకుని, అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు సమాచారం.