మున్సిపల్ ఎన్నికలు: దావోస్ నుంచి కేటీఆర్ కీలక సూచనలు!

| Edited By:

Jan 21, 2020 | 6:09 PM

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు దావోస్‌ నుంచే కీలక సూచనలు చేశారు. పోలింగ్ వ్యూహం గురించి ఫోన్‌లో చర్చించారు. ఎన్నికలు పూర్తయ్యే చివరి క్షణం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ సమన్వయకర్తలు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో మాట్లాడి పోలింగ్ కేంద్రాల వారీగా ఏజెంట్ల జాబితా తెప్పించాలని కేటీఆర్ సూచించారు. ప్రజల నుంచి […]

మున్సిపల్ ఎన్నికలు: దావోస్ నుంచి కేటీఆర్ కీలక సూచనలు!
Follow us on

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు దావోస్‌ నుంచే కీలక సూచనలు చేశారు. పోలింగ్ వ్యూహం గురించి ఫోన్‌లో చర్చించారు. ఎన్నికలు పూర్తయ్యే చివరి క్షణం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పార్టీ సమన్వయకర్తలు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో మాట్లాడి పోలింగ్ కేంద్రాల వారీగా ఏజెంట్ల జాబితా తెప్పించాలని కేటీఆర్ సూచించారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని, ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.ఎన్నికల ప్రచారంపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలను అభినందించారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదేనని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని వివరించారు.