టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను ఇండియన్ టీమ్ సెలక్షన్ ప్యానల్‌కు చైర్మన్ అయినట్లయితే.. ‘ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ధావన్ కన్నా రాహుల్‌నే ఎంపిక చేసేవాడినని’ వెల్లడించాడు.
గాయం కారణంగా ధావన్ కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే టీ20లకు అతడు రీ-ఎంట్రీ ఇచ్చి ఫర్వాలేదనిపించుకున్నాడు. కానీ ధావన్ లేని సమయంలో కేఎల్ రాహుల్ మాత్రం మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి పరుగుల వరద పారించాడు.
ఇక ఈ విషయంపై శ్రీకాంత్ మాట్లాడుతూ ‘లంక లాంటి జట్టుపై పరుగులు సాధించడం పెద్ద విషయం కాదు. ఒకవేళ నేను ఎంఎస్కె ప్రసాద్ స్థానంలో ఉండి ఉంటే.. టీ20 వరల్డ్‌కప్‌కు ధావన్‌ను ఎంపిక చేయను. ధావన్‌తో రాహుల్‌కు ఎలాంటి పోటీ లేదు. టీ20ల్లో అత్యుతమ ఆటగాడు కేవలం రాహుల్ మాత్రమేనని’ ఆయన స్పష్టం చేశాడు. కాగా, నిన్న లంకతో జరిగిన టీ20 మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.