కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!

|

May 13, 2020 | 1:23 PM

నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను.. గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ చెప్పే క్లాసిక్ డైలాగ్. ఇక ఇది నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్‌కు సరిగ్గా సరిపోతుంది.. ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆయన చేసే చేష్టలు, చర్యలు అన్నీ కూడా ఓ సంచలనమే. ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే తండ్రి మరణానంతరం కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా అధికారం చేపట్టి తండ్రికి తగ్గ తనయుడు […]

కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!
Follow us on

నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను.. గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ చెప్పే క్లాసిక్ డైలాగ్. ఇక ఇది నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్‌కు సరిగ్గా సరిపోతుంది.. ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆయన చేసే చేష్టలు, చర్యలు అన్నీ కూడా ఓ సంచలనమే. ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే తండ్రి మరణానంతరం కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా అధికారం చేపట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మొదట్లో కిమ్ జోంగ్ నామ్, కిమ్ జోంగ్ చోల్‌లలో ఒకరు నార్త్ కొరియా అధ్యక్ష పదవిని చేపడతారని అందరూ అనుకున్నా.. వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు.

ఇదిలా ఉంటే కిమ్ జోంగ్ ఉన్‌కు తరచూ తన రక్షణశాఖ మంత్రులను మారుస్తుండటం అలవాటు. 2011 నుంచి ఇప్పటివరకూ కనీసం ఆరుగురు వ్యక్తులను మార్చారు. అంతేకాకుండా కిమ్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుకుంటారు. కిమ్ భార్య పేరు రి సోల్ జు. ఆమెకు కూడా చాలా ఆంక్షలు విధించారు కిమ్. ఇలా ఒకటేమిటి ఈయన గురించి చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. కిమ్ లైఫ్ స్టైల్ అసలు ప్రపంచంలో ఎవరీకి ఉండదని చెప్పాలి. ఒకవైపు దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. ఈయన మాత్రం పూర్తి వ్యతిరేకంగా తినే తిండి దగ్గర నుంచి తాగే మందు వరకు అన్ని హైబ్రాండ్స్ వాడుతూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు.

స్థానికంగా తయారు చేసిన లిక్కర్ అంటే కిమ్‌కు అసలు నచ్చదట. ఎప్పుడూ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాడు. అమెరికన్ బ్రాండ్ లిక్కర్ కోసం దాదాపు 26 వేల డాలర్లు, అలాగే ఆయనకు ఎంతో ఇష్టమైన జర్మన్ వైన్ కోసం 95394 డాలర్లు ఖర్చు చేస్తుంటారు ఈ లిక్కర్ కింగ్. అటు కిమ్ తన కడుపు నింపుకోవడానికి కూడా కోట్లలో ఖర్చు చేస్తుంటారు. తనకు ఎంతో ఇష్టమైన పంది మాంసాన్ని తరుచుగా డెన్మార్క్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటారు. అంతేకాకుండా బ్రెజిలియన్ కాఫీ కోసం ఏకంగా 21 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. చూశారుగా ఈ నియంతకు ప్రజలు ఆకలితో అలమటించినా పట్టింపు లేదు గానీ.. ఆయనకి మాత్రం అన్నీ విదేశీ బ్రాండులే కావాలి.

Read This: భాగ్యనగర వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులకు అంతా సిద్ధం!