కియా తరలింపు రూమర్లు విశాఖ నుంచే.. వైసీపీ నేతలు ఆగ్రహం

|

Feb 06, 2020 | 1:58 PM

ఏపీలో కియా మోటర్స్ తరలింపు అంశం కాక రేపుతోంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా కార్ల తయారీ కంపెనీ త్వరలో తమిళనాడుకు తరలిపోతోందంటూ జాతీయ మీడియాలో కథనాలు రావడంతో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దానికి తెరలేచింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు..కియా మోటార్ల కంపెనీ తరలిపోవడానికి జగన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. టీడీపీ నేతలకు కౌంటరిస్తున్న వైసీపీ నేతలు బుగ్గన […]

కియా తరలింపు రూమర్లు విశాఖ నుంచే.. వైసీపీ నేతలు ఆగ్రహం
Follow us on

ఏపీలో కియా మోటర్స్ తరలింపు అంశం కాక రేపుతోంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా కార్ల తయారీ కంపెనీ త్వరలో తమిళనాడుకు తరలిపోతోందంటూ జాతీయ మీడియాలో కథనాలు రావడంతో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దానికి తెరలేచింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు..కియా మోటార్ల కంపెనీ తరలిపోవడానికి జగన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. టీడీపీ నేతలకు కౌంటరిస్తున్న వైసీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్ తదితరులు కియా కార్ల కంపెనీ ఎక్కడికీ తరలిపోవడం లేదని క్లారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అనంతపురం జిల్లాలో ఏర్పాటై ఇటీవల ఉత్పత్తిని కూడా పెద్ద ఎత్తున ప్రారంభించిన కియా కార్ల కంపెనీ త్వరలో తమిళనాడుకు తరలిపోనుందంటూ జాతీయ మీడియాలో గురువారం ఉదయం కథనాలొచ్చాయి. వాటి ఆధారంగా తొలుత మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వంలో నెలకొన్ని అవినీతి కారణంగానే కియా మోటర్ల కంపెనీ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. కియా ప్రతినిధులు ఏరి కోరి ఏపీని ఎంపిక చేసుకుంటే ప్రస్తుతం జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లనే వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళే పరిస్థితి తలెత్తుతోందని ఆరోపించారు.

ఒకవైపు జాతీయ మీడియా కథనం… మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. అనంతపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల మాధవ్ కియా మోటర్ల కంపెనీ ఎక్కడికీ తరలిపోవడం లేదని, జాతీయ మీడియా కథనం కేవలం అభూత కల్పన అని కొట్టిపారేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం ట్విటర్ ద్వారా స్పందించారు.

కియా కార్ల కంపెనీ యాజమాన్యంతో సత్సంబంధాలు కలిగి వున్న జగన్ ప్రభుత్వం వారి వ్యాపార, వాణిజ్య విస్తరణకు అన్ని విధాలా సహకరిస్తోందని, అలాంటప్పుడు కంపెనీ ఎందుకు షిఫ్టు చేస్తారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. నిజానికి కియా కంపెనీ ఏర్పాటులో చంద్రబాబు ప్రయత్నం ఏమీ లేదని, ఏపీని వద్దనుకుంటున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని కియా యాజమాన్యాన్ని ఏపీలో కంపెనీ పెట్టేలా ఒప్పించారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం మీడియా ద్వారా స్పందించారు. ‘‘కియా తమిళనాడుకు వెళుతుందంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు కొన్ని పత్రికలు ఈ వార్తలు ప్రచురించాయి.. ఇలాంటి తప్పుడు వార్తలకు చెక్ పెట్టే వ్యవస్థ కావాలి.. కియా వారే ఈ వార్త చూసి షాక్ అయ్యారు.. ఊహకు కూడా అందని అబద్ధాలు అని వారు తేల్చారు.. కియా పరిశ్రమ ఇక్కడ అద్భుతంగా కొనసాగుతోంది.. ’’ అని వ్యాఖ్యానించారు బుగ్గన.

కియా తరలింపు వంటి గాలి వార్తలను టీడీపీ నేతలే ప్రచారంలోకి తెస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. విశాఖ కేంద్రంగా పని చేస్తున్న ఓ ఐటీ కంపెనీ నుంచి ఇలాంటి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయని భావిస్తున్న కొందరు వైసీపీ నేతలు సదరు కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరుతున్నారు.