జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్, 35ఏ రద్దును కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు మద్దతు తెలిపారు. ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్ము రాష్ట్రాన్నిరెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ప్రధానాంశాలు..
1. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం
2. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలు నెరవేరాయి
3. కశ్మీర్ ప్రజలందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది
4. ఇప్పటినుంచి కశ్మీర్‌లో కొత్త చరిత్ర ప్రారంభమైంది
5. కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది
6. కశ్మీర్ ప్రజలందరికీ సమానమైన హక్కులు లభించాయి
7. ఆర్టికల్ 370తో ఒక్కరికీ న్యాయం జరగలేదు
8. ఆర్టికల్ 370తో అవినీతి, కుటుంబపాలన కశ్మీర్‌లో రాజ్యమేలింది
9. కశ్మీర్‌లో 45వేల మంది అమాయకులు చనిపోయారు
10. పాకిస్తాన్ ఆర్టికల్ 370ని ఇన్నాళ్లు ఓ ఆయుధంలా వాడుకుంది
11. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో అభివృద్ధికి అడ్డంకులు తొలిగిపోయాయి
12. కశ్మీర్ ఉద్యోగులకు యూటీ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు చేకూరుతాయి
13. పంచాయతీ ఎన్నికలు లాగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం
14. కశ్మీర్ ప్రజలు తమకు నచ్చిన నేతను సీఎంగా ఎన్నుకోవచ్చు
15. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అతిపెద్ద టూరిస్టు హబ్‌గా మారుతాయి
16. తెలుగు, హిందీ సినిమా షూటింగులకు మా తోడ్పాటు అందిస్తాం
17. కశ్మీర్‌లో బాలీవుడ్ షూటింగ్‌ల సంఖ్య పెరుగుతోంది