AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rains: భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. ఎప్పటివరకంటే?

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరిందరు తీవ్రంగా గాయపడ్డారని.. కొందరు నివాసాలు కూడా కోల్పోయినట్టు విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

Heavy Rains: భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. ఎప్పటివరకంటే?
Kerala Heavy Rain Update
Anand T
|

Updated on: Aug 01, 2026 | 8:29 PM

Share

కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా పాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి సుమారు ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డట్టు విపత్తు నిర్వహణ అధికారులు స్పస్టం చేశారు. మృతులు కొట్టాయం, ఇడుక్కి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు తెలిపారు.

అంతేకాదు.. ఈ ప్రమాదం ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 6 ప్రధాన రహదారులు కొట్టారక్కర – దిండిగల్ జాతీయ రహదారి, కుట్టిక్కానం – ముండక్కయం రోడ్డు, అలువా – మూన్నార్ రోడ్డు, కె.కె. రోడ్డు , కోజికోడ్ – వాయనాడ్ జాతీయ రహదారి, తామరస్సేరి ఘాట్ రోడ్డు ద్వంసమైనట్టు అధికారులు తెలిపారు. రాన్ని ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయని పేర్కొన్నారు.

ఈ ప్రమాదాల నేపథ్యంలో ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధంచడంతో పాటు పలు ప్రాంతాల్లో రాకపోకలను నిలివేశారు. ముఖ్యంగా తామరస్సేరి ఘాట్ రోడ్డు పై కొండచరియలు, రాళ్లు, చెట్లు రోడ్డుపైకి విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఈ ఘాట్ రోడ్డుపై ప్రయాణాలను ఆపేశారు. ఘాట్ రోడ్డులో అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, పర్యాటకులు, బరువైన వాహనాలను అనుమతి ఇవ్వరాదని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే కోజికోడ్ – వాయనాడ్ రహదారిలో ఈంగాప్పుళ వద్ద రవాణా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. వాయనాడ్ నుండి కోజికోడ్ వెళ్లే వాహనాలు.. కైతప్పొయిల్ – నాలెడ్జ్ సిటీ – కోడంచేరి మీదుగా వెళ్లాలని సూచించారు. కోజికోడ్ నుండి వాయనాడ్ వెళ్లే వాహనాలు తామరస్సేరి – కూడత్తాయి – మైకావు – కోడంచేరి మీదుగా వెళ్లాలని తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూల్‌లు, కాలేజీలకు, ఇతర కంపెనీలకు అధికారులు సెలవులు కూడా ప్రకటించారు. అలాగే వర్షాల పట్ల అప్రత్తంగా ఉండాలని ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసం అయితే తప్పా జనాలు బయటకు రావొద్దని, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us