కేరళ సీఎం పినరయి విజయన్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన 119 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో 13 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. దీనికి సబంధించిన వివరాలను కేరళ అసెంబ్లీ వెబ్‌సైట్ వెల్లడించింది. శబరిమల వివాదానికి సంబంధించి సీఎంను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వీడియోలు అప్‌లోడ్ చేసిన 26 మందిని అరెస్టు చేసినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.