కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందిన ఎమ్మెల్యే ఎం.సి. కమరుద్దీన్ ను కసర్ గఢ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తమను ఆయన ఛీట్ చేశారని పలువురు ఇన్వెస్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టుకు ముందు సిట్ బృందం ఆయనను 5 గంటలపాటు విచారించింది. ఫ్యాషన్ గోల్డ్ జువెల్లరీ గ్రూప్ చైర్మన్ కూడా అయిన కమరుద్దీన్..ఇన్వెస్టర్లను కోట్లాది రూపాయల మేర ఛీట్ చేశాడట. గత ఏడాది డిసెంబరులోనే ఫ్యాషన్ గోల్డ్ జువెల్లరీ షాపులను ఇన్వెస్టర్లకు తెలియజేయకుండా మూసివేశారు. ఈ ఎమ్మెల్యేపై గత ఆగస్టులోనే 100 కు పైగా కేసులున్నట్టు పోలీసులు తెలిపారు.