శ్రీదేవిని చంపేశారా..?

అందాల తార శ్రీదేవి మరణంపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి . ఆమెది సహజమరణం కాదంటూ కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ సరికొత్త అనుమానాలకు తెరలేపారు. కేరళ కౌముది పత్రికలో ఆయన శ్రీదేవి మరణంపై ఒక వ్యాసం రాసారు. దీనిలో ఆయన పలు రకాల సందేహాలను వ్యక్తం చేశారు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపైనే రిషిరాజ్ సింగ్ […]

శ్రీదేవిని చంపేశారా..?

Edited By:

Updated on: Jul 12, 2019 | 8:32 PM

అందాల తార శ్రీదేవి మరణంపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి . ఆమెది సహజమరణం కాదంటూ కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ సరికొత్త అనుమానాలకు తెరలేపారు. కేరళ కౌముది పత్రికలో ఆయన శ్రీదేవి మరణంపై ఒక వ్యాసం రాసారు. దీనిలో ఆయన పలు రకాల సందేహాలను వ్యక్తం చేశారు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపైనే రిషిరాజ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడిపోయి ఉండకపోవచ్చనే అభిప్రాయపడ్డారు. అయితే తన ఫ్రెండ్.. ఫోరెన్సిక్ నిపుణుడైన ఉమదతన్‌తో ఇదే విషయాన్ని చర్చించినప్పుడు ఆయనకూడా తన అభిప్రాయంతోనే ఏకీభవించారని సింగ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయంలో మాట్లాడేందుకు తన మిత్రుడు జీవించిలేరని కూడా తెలిపారు.
అయితే అతిలోక సుందరి మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయి. అయితే పోస్ట్‌మార్టమ్ నివేదిక మాత్రం ఆమెది సహజమరణమేనని తేల్చింది. తాజాగా రిషిరాజ్ సింగ్ లేవనెత్తిన అనుమానాలతో మరోసారి శ్రీదేవి మరణంపై సందేహాలు నెలకొనే పరిస్థితి వచ్చింది.

Follow Us