Keerthy Suresh Has Chiranjeevi Sister : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న మరో సినిమా ‘వేదాళం’ తెలుగు రీమేక్. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం కానుంది. ఈ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు కీర్తి సురేష్ పేరు ప్రచారం సాగింది. అయితే, తాజాగా కీర్తి సురేష్‌ను చిరు ఎంపిక చేశారని తెలిసింది. దీనిపై చర్చలు కూడా జరిగాయట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టీ నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది.
చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.