ఫేస్ బుక్‌లో రైతు ఆవేదన.. కేసీఆర్ ఫోన్

| Edited By: Vijay K

Mar 28, 2019 | 7:14 PM

ఓ రైతు ఆవేదనను చూసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్‌ ఇతరులకు పట్టా చేశారంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్‌ ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను చూసిన సీఎం వెంటనే స్పందించారు. శరత్ కుటుంబంతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కలెక్టర్‌ భారతి హోళీకేరి […]

ఫేస్ బుక్‌లో రైతు ఆవేదన.. కేసీఆర్ ఫోన్
Follow us on

ఓ రైతు ఆవేదనను చూసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్‌ ఇతరులకు పట్టా చేశారంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్‌ ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను చూసిన సీఎం వెంటనే స్పందించారు. శరత్ కుటుంబంతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో కలెక్టర్‌ భారతి హోళీకేరి నందులపల్లి గ్రామంలోని శరత్‌ ఇంటికి వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. శరత్‌ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీనిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏడెకరాల భూమిని ఇతరుల పేరుపై మార్పిడి చేసినట్టు ఫిర్యాదు వచ్చిందని, రైతులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. రైతు బంధు పథకం కూడా బాధిత రైతుకు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు. కేసీఆర్ రైతు శరత్ తో స్వయంగా మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.