#India locked down లాక్ డౌన్ మరింత కఠినం.. కేసీఆర్ కొత్త డైరెక్షన్

|

Mar 26, 2020 | 1:10 PM

21 రోజుల లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాల్సి వుందంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇపుడు అమలవుతున్న లాక్ డౌన్ సంతృప్తికరంగానే వున్నప్పటికీ మరింత కఠినంగా వచ్చే 20 రోజులు గడపాల్సి వుందన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

#India locked down లాక్ డౌన్ మరింత కఠినం.. కేసీఆర్ కొత్త డైరెక్షన్
Follow us on

KCR new direction on implementation of lock down in the state: 21 రోజుల లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాల్సి వుందంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇపుడు అమలవుతున్న లాక్ డౌన్ సంతృప్తికరంగానే వున్నప్పటికీ మరింత కఠినంగా వచ్చే 20 రోజులు గడపాల్సి వుందన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలవుతున్న తీరులపై సమీక్ష జరిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతున్నదన్న ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ పకడ్బందీగా అమలుచేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు సామాజిక దూరాన్ని పాటించక తప్పదన్నారు సీఎం. మరో మార్గం లేదు కాబట్టి లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనావ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలపై కొన్ని సూచనలు చేశారు ముఖ్యమంత్రి.

పోలీసు, వైద్య శాఖల సీనియర్‌ అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు సీఎం. పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగినవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని అధికారులకు చెప్పారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నవారి విషయంలో, క్వారంటైన్‌లో ఉన్నవారి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణలో లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలు ఇదేవిధంగా ప్రభుత్వానికి సహకరించి, సామాజిక దూరం పాటిస్తే, ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్ట్రాన్ని , తద్వారా దేశాన్ని కాపాడవచ్చన్నారు. ఎవరికి అనుమానం కలిగినా, వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు, వైద్యశాఖ సిబ్బందిని, శానిటరీ ఉద్యోగులను సీఎం కేసీఆర్‌ అభినందించారు.