
Kathhi Mahesh Comments On Sunitha Marriage: కొన్నేళ్ల పాటు ఒంటరి మహిళగా జీవిస్తూ వచ్చిన సింగర్ సునీత తాజాగా రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో శంషాబాద్‌లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం సునీత వివాహ వేడుక ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి.
ఇక సునీత ఇన్నేళ్లకైనా మళ్లీ వివాహం చేసుకోవడం పట్ల కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే… మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెగిటివ్ కామెంట్లకు చెక్ పెడుతూ ఫేస్‌బుక్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు యాంకర్, నటుడు కత్తి మహేష్. ఇంతకీ మహేష్ చేసిన ఆ పోస్ట్‌లో ఏముందుంటే. ‘ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో “ఇబ్బంది.”? అరే… ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి, ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే…హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం.
ఎదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి? ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా…హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు?’ అని పోస్ట్ చేశాడు. అయితే చివరిలో… ఇదంతా సునీత వివాహాన్ని తప్పుపడుతూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నవారికోసమే అంటూ.. ‘
PS: అర్ధం కానివారికి ఇది సెటైర్ అని తెలియజేయడమైనది. సింగర్ సునీత గారి పెళ్లిపై కొందరు సాంప్రదాయక పెద్దలు పడుతున్న “ఇబ్బంది”మీద వేసిన సెటైర్ గా గమనించ ప్రార్ధన.’ అంటూ తనదైన శైలిలో స్పందించాడు.