టోరంటో చిత్రోత్స‌వంలో ‘కార్తీ ఖైదీ మూవీ’…

యాంగ్రీ హీరో కార్తీ హీరోగా, యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ చిత్రం 'ఖైదీ'. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌ను అందుకుంది. స‌రికొత్త పంథాకు స్ఫూర్తిగా నిలిచింది. హీరోయిన్, పాట‌లు లేకుండా కేవ‌లం స్టోరీతోనే ప్రేక్ష‌కుల్ని..

టోరంటో చిత్రోత్స‌వంలో 'కార్తీ ఖైదీ మూవీ'...

యాంగ్రీ హీరో కార్తీ హీరోగా, యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ చిత్రం ‘ఖైదీ’. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌ను అందుకుంది. స‌రికొత్త పంథాకు స్ఫూర్తిగా నిలిచింది. హీరోయిన్, పాట‌లు లేకుండా కేవ‌లం స్టోరీతోనే ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది ఈ చిత్రం. కాగా ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించవ‌చ్చ‌గా, తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. కాగా ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా, వినూత్న పంథాలో తెరకెక్కిన కొత్త తరహా చిత్రంగా ప్రేక్షకుల విశేష మన్ననలు పొందింది.

ఇప్పుడు ‘ఖైది’ కి మరో విశేష గౌరవం దక్కింది. టొరంటోలో ఆగస్ట్ 9 నుండి 15 వరకు జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆగస్ట్ 12న ఖైదీ‌ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు కెకె రాధామోహన్, ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. చిత్రం కోసం పనిచేసిన టీం అందరికీ కృతజ్ఞతలు తెలియ‌జేశారు. కాగా ప్ర‌స్తుతం ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్ష‌కులకు కూడా అందించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

Read More:

బిగ్ బ్రేకింగ్ః క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు మృతి

విశాఖ ‘షిప్ యార్డు ప్ర‌మాద ఘ‌టన’‌పై సీఎం జ‌గ‌న్ ఆరా..

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం!

Click on your DTH Provider to Add TV9 Telugu