కరోనా లాక్‌డౌన్‌ వేళ.. ప్రాణం రక్షించడం కోసం.. పోలీస్ సాహసం..

| Edited By:

Apr 18, 2020 | 7:54 PM

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఈ పరిస్థితుల్లో 'నాకు అవసరమైన మందులు బెంగళూరులోనే దొరుకుతాయి.

కరోనా లాక్‌డౌన్‌ వేళ.. ప్రాణం రక్షించడం కోసం.. పోలీస్ సాహసం..
Follow us on

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఈ పరిస్థితుల్లో ‘నాకు అవసరమైన మందులు బెంగళూరులోనే దొరుకుతాయి. లాక్‌డౌన్‌తో మందులు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నాను’ అంటూ ధార్వాడకు చెందిన కేన్సర్‌ రోగి ఒకరు ఓ ప్రైవేటు చానల్‌ ద్వారా తన వేదనను వెలిబుచ్చాడు.

కాగా.. అతడి ఆవేదనను చూసి బెంగళూరు నగర సీపీ కార్యాలయంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హెచ్‌.కుమారస్వామి కరిగిపోయారు. ఉన్నతాధికారుల అనుమతితో ఈ నెల 12న సదరు కేన్సర్‌ బాధితుడికి అవసరమైన మందులు తీసుకుని బైక్‌పై 960 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్వాడ వెళ్లి స్వయంగా అందజేసి అధికారుల మన్ననలు పొందారు.

Also Read: ఈనెల 20 నుంచి.. జాతీయ రహదారులపై.. టోల్ వసూల్..