ముంబై చేరిన ‘ కర్ణాటక డ్రామా ‘.. పోలీసులతో మంత్రి శివకుమార్ వాగ్వాదం

|

Jul 10, 2019 | 11:10 AM

కర్ణాటక రాజకీయ డ్రామా ముంబై చేరింది. ముంబై నగరంలోని రినైజాన్స్ హోటల్ లో బస చేసిన జేడీ-ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించి.. తిరిగి బెంగుళూరు చేర్చి.. వారిని శాంత పరచడానికి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డి.కె. శివకుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన మద్దతుదారులతో ఆ హోటల్ వద్దకు చేరుకున్న శివకుమార్ ను పదుల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. తాను ఈ హోటల్ లోని ఎమ్మెల్యేలతో కాసేపు కూర్చుని మాటామంతీ చేసి. […]

ముంబై చేరిన   కర్ణాటక డ్రామా .. పోలీసులతో మంత్రి శివకుమార్ వాగ్వాదం
Follow us on

కర్ణాటక రాజకీయ డ్రామా ముంబై చేరింది. ముంబై నగరంలోని రినైజాన్స్ హోటల్ లో బస చేసిన జేడీ-ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించి.. తిరిగి బెంగుళూరు చేర్చి.. వారిని శాంత పరచడానికి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డి.కె. శివకుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన మద్దతుదారులతో ఆ హోటల్ వద్దకు చేరుకున్న శివకుమార్ ను పదుల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. తాను ఈ హోటల్ లోని ఎమ్మెల్యేలతో కాసేపు కూర్చుని మాటామంతీ చేసి. .వారితో కలిసి కాఫీ తాగి వస్తానని శివకుమార్ చేసిన అభ్యర్థనను పోలీసు అధికారులు తిరస్కరించారు. ఒక పోలీసు అధికారి అయితే.. మీకు కాఫీ తాగాలని అనిపిస్తే దగ్గరలోని గెస్ట్ హౌస్ లో ఆ ఏర్పాటు చేయిస్తానని సున్నితంగా చెప్పడంతో శివకుమార్ మాట్లాడలేకపోయారు. ఆయనతో బాటు ఆయన అనుచరులను కూడా దాదాపు వందమంది పోలీసులు చుట్టుముట్టడంతో వీరంతా ఆ హోటల్ గేటు వద్దకు కూడా చేరుకోలేకపోయారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పాపులర్ అయిన శివకుమార్.. ముంబైలో తన ‘ చాణక్యాన్ని ‘ ప్రదర్శించలేకపోయారు. అటు-హోటల్లో ఉన్న సుమారు 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు కర్ణాటక సీఎం కుమారస్వామి నుంచి, శివకుమార్ నుంచి ప్రాణ హాని ఉందని, ఏ క్షణమైనా వారి అనుచరులు ఈ హోటల్ పై దాడి చేసి తమను బలవంతంగా బెంగుళూరుకు తరలించే ‘ ప్రమాదం ‘ ఉందని ముంబై పోలీసులకు మొర పెట్టుకున్నారు.

ఇలా ఉండగా.. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది సభ్యుల లేఖలు జెన్యూన్ గా లేవని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించడంతో కుమారస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది.