AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌కు కరోనా

కరోనా బారినపడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. సెలబ్రెటీలు, సినీ, రాజకీయ నేతలకు కొవిడ్ పాజిటివ్ సోకి ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌కు కరోనా
Balu
|

Updated on: Aug 30, 2020 | 5:36 PM

Share

కరోనా బారినపడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. సెలబ్రెటీలు, సినీ, రాజకీయ నేతలకు కొవిడ్ పాజిటివ్ సోకి ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అయితే ఎలాంటి లక్షణాలు లేవని ఆయన ట్వీట్టర్ లో పేర్కొన్నారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ వైద్యుల సలహాతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉండి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఎవరు కరోనా నుంచి భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.

కర్ణాటకలో కరోనా బారిన పడుతన్న రాజకీయ నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అటు ఇవాళ కర్ణాటకలో రికార్డుస్థాయిలో 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Follow Us