పీఏకి కరోనా సోకడంతో.. హోం క్వారంటైన్‌లోకి అదనపు డీజీపీ..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో తన వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కర్నాటకలోని సీనియర్ పోలీస్ అధికారి

పీఏకి కరోనా సోకడంతో.. హోం క్వారంటైన్‌లోకి అదనపు డీజీపీ..

Edited By:

Updated on: Jun 22, 2020 | 9:12 PM

Karnataka ADGP: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో తన వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కర్నాటకలోని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల పలువురు సహచరులు కరోనా బారిన పడడంతో అనేక మంది పోలీసులు, వారి కుటుంబాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

కాగా.. ఇప్పటి వరకు కర్నాటక రాష్ట్ర రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన 56 మంది సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కర్ణాటక రాష్ట్ర శాంతి భద్రతల విభాగంలో అదనపు డీజీపీగా ఉన్న అమర్ కుమార్ పాండే మాట్లాడుతూ… ‘‘అవును నా వ్యక్తిగత సహాయకుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను..’’ అని పేర్కొన్నారు.