పొద్దున్నే ఫోన్ ఎత్తాలంటే భయపడుతోందట!

ఉదయాన్నే ఫోన్ ఎత్తాలంటే నటి కళ్యాణి భయపడుతోందట. కరాటే కళ్యాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమె పలు సినిమాలతో పాటు సీరియల్లో కూడా నటిస్తూనే ఉంది. అలాగే న్యూస్ ఛానెల్స్‌లో కూడా రకరకాల డిస్కర్షన్స్‌లో పాల్గొంటోంది కూడా. తాజాగా.. ఆమెకు ఆకతాయిల ఫోన్ కాల్స్, అసభ్య పదజాలంతో కూడుకున్న మెసేజ్‌ల వేధింపులు ఎక్కువయ్యాయట. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పొద్దున్నే ఫోన్ చూడాలంటే భయమేస్తుందని.. కొందరు నా ఫొటోలను మార్ఫింగ్ చేసి […]

పొద్దున్నే ఫోన్ ఎత్తాలంటే భయపడుతోందట!

Updated on: Jan 30, 2020 | 1:21 PM

ఉదయాన్నే ఫోన్ ఎత్తాలంటే నటి కళ్యాణి భయపడుతోందట. కరాటే కళ్యాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమె పలు సినిమాలతో పాటు సీరియల్లో కూడా నటిస్తూనే ఉంది. అలాగే న్యూస్ ఛానెల్స్‌లో కూడా రకరకాల డిస్కర్షన్స్‌లో పాల్గొంటోంది కూడా. తాజాగా.. ఆమెకు ఆకతాయిల ఫోన్ కాల్స్, అసభ్య పదజాలంతో కూడుకున్న మెసేజ్‌ల వేధింపులు ఎక్కువయ్యాయట. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పొద్దున్నే ఫోన్ చూడాలంటే భయమేస్తుందని.. కొందరు నా ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని దారుణమైన రీతిలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారని వాపోయింది. ఎన్ని నెంబర్లను బ్లాక్ చేసినా.. వేరే ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్‌లో అశ్లీల వీడియోలు పంపుతున్నారని పోలీసులకు తెలిపింది. ఎలాగైనా వారిపై చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. ఇటీవలే సింగర్ కౌశల్య కూడా ఇలాంటి వేధింపులకే గురయ్యారు.

Loading...
Unable to load recommendations.
Follow Us